TS Corona Cases: తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు..

TS Corona Cases: తెలంగాణలో కొత్తగా 245 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Update: 2021-08-15 14:23 GMT

Corona Cases: తెలంగాణలో కొత్తగా 245 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 50,126 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ లో పేర్కొంది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 6,52,380కు చేరింది. 24 గంటల వ్యవధిలో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,842కి చేరింది. 24గంటల వ్యవధిలోనే 582 మంది కోలుకోని డిశార్చ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7,268 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,41,270కి చేరింది.

Tags:    

Similar News