AAP Priyanka Kakkar : రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే ఆప్ పోటీ : తెలంగాణ ఇన్చార్జ్ ప్రియాంక కక్కర్

Update: 2025-08-02 09:00 GMT

రాబోయే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆపార్టీ తెలంగాణ ఇన్చార్జ్ ప్రియాంక కక్కర్ తెలిపారు. ఇండియా కూటమితో పొత్తు పార్ల మెంట్ ఎన్నికల వరకే ఉంటుందని స్పష్టంచే శారు. కేంద్ర ప్రభుత్వం కావాలని ఓటర్ లిస్ట్ లో నుంచి ప్రజల ఓట్లను తొలగిస్తున్నారని మండిపడ్డారు. చీటింగ్ చేసైనా సరే గెలవాలని బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. రెండు రోజుల పర్యటన కోసం ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న ప్రియాంక కక్కర్ కు ఆప్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 'టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు. అయినా కూడా ఆయన భావాలన్ని ఆర్ఎస్ఎస్ కు సంబంధించినవిగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి బీజేపీ సూచనల మేరకు రాష్ట్రంలో అధికారాన్ని నడిపిస్తున్నాడు. ఆయన భాష కూడా ఎలా ఉంటుందో ప్రజలందరూ వింటున్నరు. అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగానే పోటీ చేస్తం. తెలంగాణలో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేసేందుకు అందరిని కలుపుకొని ముందుకు వెళ్తం' అని పేర్కొన్నారు.

Tags:    

Similar News