Telangana: అలెర్ట్.. తెలంగాణకు భారీ వర్ష సూచన...

Update: 2025-09-11 05:39 GMT

తెలుగురాష్ట్రాలపై ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతోంది. దీని ఫలితంగా గత రెండు రోజులుగా పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు, హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. ఈరోజు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

తెలంగాణలోని కామారెడ్డి, సిరిసిల్ల, మెదక్, నిజామాబాద్, నిర్మల్, సంగారెడ్డి జిల్లాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అదే విధంగా గద్వాల్, వనపర్తి, నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని...ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Tags:    

Similar News