TTD : శ్రీవారి ప్రసాదంపై శివజ్యోతి అహంకారం.. దుమ్మెత్తిపోస్తున్న భక్తులు

Update: 2025-11-25 06:45 GMT

యాంకర్ శివజ్యోతి ఇటీవల శ్రీవారి దర్శనానికి వెళ్లిన సమయంలో చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి. ఆమె ఎల్-1 క్యూ లైన్‌లో నిల్చుని శ్రీవారి ప్రసాదం గురించి చేసిన వ్యాఖ్యలు భక్తుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపుతున్నాయి. దర్శన క్యూ‌లో ఉండగానే, “మేము ప్రసాదం అడుక్కుంటున్నాం… రిచ్చెస్ట్ బిచ్చగాళ్లం” అంటూ వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలపై భక్తులు మండిపడుతున్నారు. పవిత్ర స్థలంలో ఇలాంటి జోకులు వేయడం ఏంటి అని ఏకి పారేస్తున్నారు. మీరు జోకులు వేయడానికి, రీల్స్ చేయడానికి తిరుమల వస్తారా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమె క్షమాపణలు చెప్పినా కూడా భక్తుల ఆగ్రహం తగ్గే సూచనలు కనిపించడం లేదు.

ఎందుకంటే ఆ క్షమాపణ వీడియోలో కూడా శ్రీవారిపై భక్తి కనబడలేదని నెటిజన్లు అంటున్నారు. తిరుమలలో ప్రధానమంత్రి, రాష్ట్రపతి వంటి అత్యున్నత నేతలు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకుంటారు. మరి వాళ్లతో పోలిస్తే శివజ్యోతి ఎంత అంటున్నారు. ఈ పిచ్చి రీల్స్ కోసం పవిత్రతను కాలుష్యం చేయడం ఏంటని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. ఆవిడ శ్రీవారి దర్శనానికి వెళ్లి ఎల్-1 క్యూ లైన్ లో నిల్చుని అపచార కామెంట్లు చేశారు. మేం ప్రసాదం అడుక్కుంటున్నాం, రిచ్చెస్ట్ బిచ్చగాళ్లం అంటూ దిక్కుమాలిన కామెంట్లు చేస్తూ నవ్వింది.

దీనిపైనే తీవ్రంగా వ్యతిరేకత వస్తోంది. శివజ్యోతి తన వీడియోలో తాను సంపాదించింది అంతా వెంకటేశ్వరుడి దయ అంటుంది. ఇది మాత్రం అబద్ధం. ఎందుకంటే బిగ్ బాస్ తో వచ్చిన ఫేమ్ ను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడానికి వాడుకుంది. అలాంటి దరిద్రమైన పని చేసి డబ్బులు సంపాదించి ఇప్పుడు రిచ్చెస్ట్ బిచ్చగాళ్లు అంటుంది. ఇంతకంటే పొగరు ఉండదని అంటున్నారు శ్రీవారి భక్తులు. ఆమెకు కచ్చితంగా దేవుడే గట్టి శిక్ష వేస్తాడని అంటున్నారు. శివజ్యోతిలాగా ఎవరైనా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదంటున్నారు.


Full View

Tags:    

Similar News