రాష్ట్రంలో మద్యం షాపుల టెండర్ల కోసం ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. నవంబర్ 30 తో ప్రస్తుత వైన్స్ షాపుల గడువు ముగియనుంది. డిసెంబర్ 1 నుంచి కొత్త పాలసీని అమల్లోకి తెచ్చేందుకు ప్రభు త్వం గెజిట్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,620 వైన్ షాపులకు దరఖాస్తులు స్వీకరించనుంది. గతంలో రూ. 2 లక్షలు ఉన్న దరఖాస్తు ఫీజును మూడు లక్షలకు పెంచుతున్నట్టు ప్రకటిం చింది. దీని ద్వారా 3,500 కోట్ల రూపాయల ఆదాయం సర్కారుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఐదు వేల లోపు జనాభా ఉన్న హ్యా బిటేషన్లకు సంబంధించి 50 లక్షల రూపాయల ఫీజును వసూలు చేయాలని నిర్ణయించింది. 50 వేల నుంచి లక్ష లోపు జనాభా ఉంటే రూ. 60 లక్షలు, లక్ష నుంచి ఐదు లక్షల జనాభా ఉన్న ప్రాంతాలకు 65 లక్షల రూపాయలు, ఐదు లక్షల నుంచి 20 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.85 లక్షలు, 20 లక్షల కన్నా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కోటీ పది లక్షల రూపాయల లైసెన్సు ఫీజు వసూలు చేయ నున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో రాత్రి 11 గంటల వరకు, గ్రామాల్లో రాత్రి 10 గంటల వరకు వైన్స్ లు తెరిచి ఉంచాలని నిబంధన కూడా పెట్టింది. వైన్ షాపుల కేటాయింపులో రిజర్వేషన్లు సైతం పాటించనున్నారు. గౌడ్స్ కు 15% రిజర్వేషన్లు, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5% రిజర్వేషన్లను అమలు చేయనున్నారు. దర ఖాస్తుల ద్వారానే భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది.