ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వం కూలిపోతుంది: బండి సంజయ్
రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ బీజేపీ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు.;
ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ బీజేపీ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. వరంగల్‌లో బీజేపీ ఆధ్వర్యంలో పట్టభద్రుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న సంజయ్.. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. తెలంగాణలో ఏం జరుగుతున్నా సీఎం కేసీఆర్ స్పందించడం లేదని మండిపడ్డారు. పాలనా వ్యవస్థ కుంటుపడిందని.. భైంసాలో ఘటనలపై చర్యలు తీసుకోలేదని బండి సంజయ్ ధ్వజమెత్తారు. బీజేపీ ఉద్యమం వల్లే ఉద్యోగులకు పీఆర్‌సీ పెంపు నిర్ణయం తీసుకున్నారని అన్నారు.