TG : అభివృద్ధిలో నా మార్క్ చూపిస్త : బండి సంజయ్

Update: 2024-07-15 05:55 GMT

ఇక నుంచి అభివృద్ధిలో తన మార్కు చూపిస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ( Bandi Sanjay ) అన్నారు. స్మార్ట్ సిటీ మిషన్ పొడిగింపు సందర్భంగా మేయర్ సునీల్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపే కార్పొ రేటర్లు కేంద్ర మంత్రిసంజయ్ ను కలిసి సన్మానించారు. అనంతరం సంజయ్ మాట్లాడుతూ 'కరీంనగ ర్ అభివృద్ధికి నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది. అద్దంలా తీర్చిదిద్దే బాధ్యత నాది.' అని హామీ ఇచ్చారు. కరీంనగర్ ను అద్భుతంగా అభివృద్ధి చేసి రుణం తీర్చుకునేందుకు కసితో పనిచేస్తున్నట్లు చెప్పారు. కరీంనగర్ అభివృద్ధిపై మంత్రి పొన్నం, ఎమ్మెల్యే గంగులతోనూ కలిసి చర్చిస్తా నని ఆయన తెలిపారు. స్మార్ట్ సిటీ కింద మిగిలిన నిధులు త్వరలోనే మంజూరు చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అందరం కలిసి కరీంనగర్ అభివృద్ధి కోసం పనిచేద్దామని పిలుపునిచ్చారు. రాజకీయ గొడవలు మాని రాబోయే జనరల్ బాడీలో అద్భతమైన ప్రణాళిక ను రూపొందించాలని సూచించారు. కిందిస్థాయి నుండి ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వాళ్లకే సమస్యలను పరిష్క రించే అవగాహన ఉంటుందన్నారు. ఇక్కడున్న కార్పొరేటర్లలో భవిష్యత్తులో ఎంపీ, కేంద్ర మంత్రి కావొచ్చన్నారు. 'కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధిపై ప్ర ణాళిక రూపొందించండి. వాటి అమ లుకోసం నిధులు తీసుకొస్తా, అయితే మీరు ఒక్కటి గుర్తుంచుకోవాలి. కేంద్రం నేరుగా నిధులివ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన, వాటా ఉంటేనే కేంద్రం నిధులు ఇవ్వగలుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నేరుగా కేంద్రం నిధులిచ్చే అవకాశమే ఉంటే కరీంనగర్ ను అద్దంలా తీర్చిదిద్దేవాడి ని' అని ఆయన అన్నారు.

Tags:    

Similar News