డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ విజయవాడ వెళ్లారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తో కలిసి ఇటు ఖమ్మం జిల్లాలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలిస్తారు. దీనికోసం భట్టి విక్రమార్క, బండి సంజయ్ ఇద్దరు ఒకే హెలికాప్టర్‌లో విజయవాడకు బయలుదేరారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో..నీట మునిగి పంట పొలాలను పరిశీలిస్తారు. పాలేరు ట్యాంక్ బండ్ వద్ద వరద బాధితులతో నేరుగా మాట్లాడుతారు. మధ్యాహ్నం కేంద్ర మంత్రి శివరాజ్ చౌహన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క అధికారుల సమీక్షా సమావేశంలో పాల్గొంటారు.
విజయవాడలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ చౌహన్‌తో వీరు భేటీ అవుతారు. అనంతరం అక్కడి నుండి ఖమ్మం జిల్లాలో ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తారు. తెలుగు రాష్ట్రాలు వరదలో ఉమ్మడి పోరాటాన్ని చేస్తాయని..కోలుకునేందుకు రెండు ప్రభుత్వాలు సహకరించుకుంటాయని నేతలు తెలిపారు.