కేటీఆర్ మాటలే నా విజయాన్ని ఖరారు చేశాయి-ఈటల
Etela Rajender:సొంత పార్టీ నేతలకు ఖరీదు కట్టి... అభాసు పాలయ్యారని విమర్శించారు.;
Etela Rajender: టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాటలే... తన విజయాన్ని ఖరారు చేశాయని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. సొంత పార్టీ నేతలకు ఖరీదు కట్టి... అభాసు పాలయ్యారని విమర్శించారు. తాను రాజీనామా చేయడం వల్లే హుజూరాబాద్ ప్రజానీకానికి చాలా లాభాలు జరిగినట్టే... రాష్ట్రం మొత్తానికి జరగాలని అన్నారు. దళిత బంధు కేవలం హుజురాబాద్‌లోనే కాదు... రాష్ట్రంలోని అన్ని వర్గాల్లోని పేదలకు అందించాలని డిమాండ్ చేశారు. హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే విందులు ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు.