హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు సపోర్ట్ ఇచ్చారు పొలిటికల్ లీడర్ చికోటి ప్రవీణ్. ప్రతి మతాన్ని హిందువులు గౌరవిస్తారన్నారు. మాధవీలత పోలింగ్ సందర్భంగా ముస్లిం మహిళల ముఖానికి అడ్డుగా ఉన్న నఖాబ్ ను తీసి ముఖం చూపించాలని అడగడంలో తప్పేంటని ప్రశ్నించారు.
పాస్ పోర్టుకు వెళ్లినప్పుడు బురఖా తీయరా అని ప్రశ్నించారు ప్రవీణ్. ఓల్డ్ సిటీలో ఎంఐఎం మొత్తం రిగ్గింగ్‌కు పాల్పడినట్లు ఆరోపించారు.
ముస్లింలను గౌరవిస్తామన్న చికోటి.. వారేమన్నా అంటే మాత్రం తప్పకుండా కౌంటర్ ఇస్తామన్నారు. చికోటి ప్రవీణ్ కామెంట్స్ ఇంట్రస్టింగ్ గా మారాయి.