TG : గాంధీకి వెళ్లాలనుకున్న బీఆర్ఎస్ నేతలు హౌజ్ అరెస్ట్

Update: 2024-09-23 09:30 GMT

తెలంగాణలో గాంధీ ఆస్పత్రి సహా దవాఖానాల పరిస్థితిపై అధ్యయనం చేసేందుకు సిద్ధమైన బీఆర్‌ఎస్ నిజ నిర్ధారణ కమిటికి కాంగ్రెస్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య వ్యవస్థ దిగజారిందని ఆరోపిస్తూ దవాఖానాల పరిస్థితిపై అధ్యయనానికి డాక్టర్‌ రాజయ్య, ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్‌తో త్రిసభ్య కమిటీని బీఆర్ఎస్ అధిష్టానం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇవాళ్టినుంచి క్షేత్రస్థాయిలో పర్యటించాలని నిర్ణయించింది. ఐతే.. గాంధీ ఆస్పత్రిని సందర్శించేందుకు సిద్ధమైన రాజయ్య సహా కమిటీ సభ్యులను పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. వారి ఇళ్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. దీనిపై బీఆర్‌ఎస్ నేతలు మండిపడుతున్నారు.

Tags:    

Similar News