BRS: బీఆర్‌ఎస్‌కు షాకుల మీద షాకులు

మాజీ ఎమ్మెల్యేల రాజీనామాలతో షాక్;

Update: 2025-08-05 05:30 GMT

బీ­ఆ­ర్ఎ­స్‌ పా­ర్టీ­కి బి­గ్‌­షా­క్ తగి­లిం­ది. అచ్చం­పేట మాజీ ఎమ్మె­ల్యే గు­వ్వల బా­ల­రా­జు ఆ పా­ర్టీ­కి రా­జీ­నా­మా చే­శా­రు. ఈ మే­ర­కు పా­ర్టీ చీఫ్ కే­సీ­ఆ­ర్‌­కు రా­జీ­నా­మా లే­ఖ­ను పం­పిం­చా­రు. బీ­జే­పీ­లో చే­రా­ల­ని ఆయన ని­ర్ణ­యిం­చు­కు­న్న­ట్లు వా­ర్త­లు వస్తు­న్నా­యి. ఈ నెల 9న గు­వ్వల బీ­జే­పీ గూ­టి­కి చేరే ఛా­న్స్ ఉం­ద­న్న చర్చ సా­గు­తోం­ది. తె­లం­గాణ ఉద్య­మం నాటి నుం­చి బీ­ఆ­ర్ఎ­స్ లో కొ­న­సా­గా­రు గు­వ్వల. దీం­తో గత మూడు ఎన్ని­క­ల్లో ఆయ­న­ను అచ్చం­పేట అభ్య­ర్థి­గా బరి­లో­కి దిం­చిం­ది గు­లా­బీ పా­ర్టీ. 2014, 2018లో ఆయన వరుస వి­జ­యా­లు సా­ధిం­చా­రు. కానీ, గత ఎన్ని­క­ల్లో మా­త్రం కాం­గ్రె­స్ అభ్య­ర్థి చి­క్కు­డు వం­శీ­కృ­ష్ణ చే­తి­లో ఓటమి పా­ల­య్యా­రు. ఓటమి నాటి నుం­చి కూడా ఆయన బీ­ఆ­ర్ఎ­స్ లో యా­క్టీ­వ్ గా ఉంటూ వస్తు­న్నా­రు. వారం క్రి­తం హరీ­ష్ రావు నా­గ­ర్ కర్నూ­ల్ జి­ల్లా పర్య­ట­న­లో­నూ పా­ల్గొ­న్నా­రు. మరికొందరు నేతలు పార్టీని వీడే ఛాన్స్ ఉందన్న వార్తలు వస్తున్నాయి.

అలంపూర్ మాజీ ఎమ్మెల్యే అబ్రహం బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు పంపించారు. గువ్వల బాలరాజు బాటలోనే అలంపూర్ మాజీ ఎమ్మెల్యే అబ్రహం కూడా బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో అప్పటి నుంచి అబ్రహం పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయనకు బదులుగా విజయుడికి అలంపూర్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతోనే అబ్రహం పార్టీతో సంబంధాలు తెంచుకుంటున్నారని అప్పట్లోనే ప్రచారం జరిగింది. అప్పట్లో కూడా అబ్రహం బీజేపీలో చేరబోతున్నారని పెద్ద ఎత్తున మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు గువ్వల బాలరాజుతో కలిసి రాజీనామా చేయడంతో, అబ్రహం కూడా కాషాయ తీర్థం పుచ్చుకోనున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 

Tags:    

Similar News