Accident in KTR Area : పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు.. కేటీఆర్ ఇలాకాలో ప్రమాదం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్ళింది. గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామ సమీపంలో బ్రిడ్జి ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. వెంటనే రంగంలోకి దింపిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు