Car Accident : ఖమ్మంలో కారు బీభత్సం

Update: 2024-12-30 11:00 GMT

ఖమ్మంలో కారు బీభత్సం సృష్టించారు. ఫ్లైఓవర్‌పై సెంట్రల్ డివైడర్‌ను ఢీ కొట్టి బోల్తా పడింది. ముగ్గురికి గాయాలవగా... ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించక పోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వైజాగ్ నుంచి వరంగల్‌కు ముగ్గురు ప్రయాణిస్తున్న మారుతి బాలేనో కారు సత్తుపల్లి పట్టణంలో ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై సెంట్రల్ డివైడర్‌ను అదుపుతప్పి ఢీకొట్టిది. దాంతో గాలిలోకి కారు పల్టీలు కొట్టి తలకిందులుగా ఫ్లైఓవర్‌పై పడిపోయింది. సెంటర్ డివైడర్‌పై ఉన్న లైటింగ్ స్తంభం బేస్ నుంచి విరిగిపోయి రహదారిపై పడిపోయింది. కారు రహదారిపై తలకిందులుగా ఉండటంతో ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు క్రేన్‌ని తెప్పించి తలక్రిందులుగా ఉన్న కారుని రహదారిపై నుంచి తొలగించారు. దాంతో వాహనాలు యధావిధిగా రహదారిపై ప్రయాణించాయి.

Tags:    

Similar News