TS : తెలంగాణ చిహ్నంలో మార్పులు ఇవే!

Update: 2024-05-28 05:35 GMT

తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఖరారు చేశారు. తాను సూచించిన ఆలోచనల మేరకు ప్రముఖ చిత్రకారుడు రుద్ర రాజేశం ఆధ్వర్యంలో రూపొందించిన లోగోలను సోమవారం పరిశీలించి ఆమోదముద్ర వేశారు. మొత్తం 12 నమూనాలతో లోగో చిత్రాలను రూపొందించగా.. వాటన్నింటినీ పరిశీలించి తుది నిర్ణయం తీసుకు న్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

గత చిహ్నంలో చార్మినార్, కాకతీయ తోరణం ఉండగా.. ఇప్పటి లోగోలో ప్రజాస్వామ్యం, తెలంగాణ ఉద్యమం ప్రతిబింబించేలా తీర్చిదిద్దాలన్న సీఎం సూచనల మేరకు రూపొందించినట్లు తెలుస్తోంది. కొత్త చిహ్నాన్ని జూన్ 2న అధికారికంగా తెలంగాణ అవతరణ దినో త్సవం సందర్భంగా ఆవిష్కరించనున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని, రాష్ట్ర చిహ్నాన్ని, రాష్ట్ర గేయాన్ని, మార్చాలని ఇటీవల జరిగిన మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సబ్బండ వర్గాల ఆత్మగౌరవం ప్రతిబించించేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకువస్తున్నట్లు.. తిరుగుబాటు చేసిన చాకలి ఐలమ్మ, రజాకార్లపై తుపాకీ ఎక్కుపెట్టిన మల్లు స్వరాజ్యం వంటి వారి ఉద్యమస్ఫూర్తి కనిపించేలా విగ్రహం రూపుదిద్దుకుంటున్నట్లు చెబుతున్నాయి.

తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది తామేనని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఉత్సవాలు కావడంతో అత్యంత భారీగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ చేతుల మీదుగా జూన్ 2న రాష్ట్ర గీతాన్ని విడుదల చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News