CM Ramesh : సీఎం రమేష్ ఫిర్యాదు.. బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌ను విచారించనున్న పోలీసులు

Update: 2025-09-20 09:05 GMT

బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు ఇవాళ విచారించనున్నారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌ గతంలో గాదరి కిశోర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టనున్నారు. సీఎం రమేశ్‌ తన ఫిర్యాదులో గాదరి కిశోర్ తనను దూషిస్తూ మాట్లాడారని ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా జూబ్లీహిల్స్ పోలీసులు ఇటీవల గాదరి కిశోర్‌కు నోటీసులు జారీ చేశారు. నేడు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ వివాదం రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. విచారణలో గాదరి కిశోర్ ఏ విషయాలు వెల్లడిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో పోలీసులు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చూడాలి.

Tags:    

Similar News