భారీ వర్షంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయానికి వచ్చారు. ఖైరతాబాద్ వచ్చేసరికి ఆయన కాన్వాయ్ వర్షంలో చిక్కుకుంది. వర్షంలోనే డ్యూటీ చేశారు ట్రాఫిక్ పోలీసులు.
సీఎం కారుకు, కాన్వాయ్ కు లైన్ క్లియర్ చేశారు పోలీసులు. సిటీ రోడ్లపై నిలిచిన నీళ్ల నుంచే సీఎం కాన్వాయ్ రయ్ రయ్ మని దూసుకెళ్లింది. పలుచోట్ల రోడ్లపై నిలిచిన నీరు కారణంగా స్లోగా వెళ్లింది. సీఎం ఈ సమయంలో నిలిచిన నీళ్లను ఆసక్తిగా గమనించడం కనిపించింది.
సచివాలయానికి చేరుకున్న సీఎం హైదరాబాద్‌లోని వర్షప్రభావిత ప్రాంతాలపై సమీక్షించారు. సహాయక చర్యలను స్పెషల్ టీమ్స్ ను దించాలని.. ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు.