TS : సీఎం రేవంత్ గుడ్‌ ఫ్రైడే శుభాకాంక్షలు

Update: 2024-03-29 06:39 GMT

గుడ్‌ ఫ్రైడే (Good Friday) సందర్భంగా క్రైస్తవులకు గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ (CP Radhakrishnan) శుభాకాంక్షలు తెలిపారు. యేసు చూపిన కరుణ, సేవ, ప్రేమ మార్గంలో అందరం పయనించాలన్నారు. యేసు బోధనలు మానవాళికి ఎంతో స్ఫూర్తిదాయకమని గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శాంతి, కరుణ సందేశాలతో పాటు యేసు క్రీస్తు నేర్పిన త్యాగం, సేవ, దయ, ప్రేమ, సోదరభావం ఎన్నటికీ మానవాళికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

గుడ్‌ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు. యేసు త్యాగాల జ్ఞాపకంగా జరుపుకొనే గుడ్‌ఫ్రైడే వేడుకలను క్రెస్తవ సోదర, సోదరీమణులు ఘనంగా జరుపుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆయన యేసుక్రీస్తు త్యాగాన్ని, ధైర్యాన్ని గుర్తుచేసుకున్నారు. మంత్రి సీతక్క కూడా అందరికీ గుడ్‌ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు.

Tags:    

Similar News