తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెల 16న ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై పార్టీ పెద్దలతో సీఎం, ఇతర మంత్రులు చర్చించనున్నట్టు తెలుస్తోంది.
రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన అంశాలను పార్టీ అధినాయకత్వం పెద్దలకు వివరించడంతోపాటు ప్రధాని నరేంద్రమోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా ఇతర కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సాయం చేయాలని కోరనున్నారు.
వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు బుధవారం నుంచి కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది. వరద నష్టం గురించి ఈ సందర్భంగా కేంద్ర బృందానికి ప్రభుత్వం తమ ప్రతిపాదనలు అందివ్వనుంది.