TG : కాంగ్రెస్‌కు జన్ లోక్ పాల్ షాక్.. ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే తెలంగాణలో హంగ్

Update: 2024-12-06 13:00 GMT

తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తి కావడంతో.. ప్రజాపాలనపై జనం స్పందనపై జన్ లోక్ పాల్ సంస్థ సర్వే చేసింది. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే హంగ్ అసెంబ్లీ ఏర్పడనుందని ఈ సర్వేలే వెల్లడైంది. ఏ పార్టీకి పూర్తి స్థాయిలో మెజార్టీ వచ్చే అవకాశం లేదని ఈ సర్వేలో తేలింది. సర్వే ఫలితాల ప్రకారం కాంగ్రెస్ కు 45 నుంచి 49 సీట్లు, బీజేపీకి 35 నుంచి 40 సీట్లు, బీఆర్ఎస్ కు 22నుంచి 27 సీట్లు, ఎంఐఎంకు 6నుంచి 7 సీట్లు రానున్నాయి. జనలోక్ పాల్ సర్వే ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్యే హోరా హొరీ జరగనుంది. బీఆర్ఎస్ మాత్రం మూడో స్థానానికి పరిమితమైంది. జన్ లోక్ పాల్ సర్వేపై తెలంగాణలో హాట్ హాట్ చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News