TG : మూసీ వ్యవహారంతో ఇరుకునపడ్డ కాంగ్రెస్

Update: 2024-10-03 10:15 GMT

మొన్నటి వరకు మూసీ వ్యవహారం... ఇప్పుడు మూవీ వ్యవహారం కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పదేళ్ల బీఆర్ఎస్‌ పాలనకు చెక్‌పెట్టి అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే కాంగ్రెస్‌ తన గొయ్యి తానే తవ్వుకుంటోందని పొలిటికల్ విశ్లేషకులు భావిస్తున్నారు. హైడ్రా, మూసీ ప్రక్షాళనపై సామాన్యుడి నుంచి న్యాయస్థానం వరకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా మంత్రి కొండా సురేఖ కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో సినీ ఇండస్ట్రీని షేక్‌ చేస్తోంది. దీంతో అసలు కాంగ్రెస్‌కు ఏమైందని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. మునుపటిలా నేతల వ్యవహారం లేదని ఇలాగే కొనసాగితే పార్టీ భవిష్యత్‌ అగమ్యగోచరమేనని టాక్‌ వినిపిస్తోంది. 

Tags:    

Similar News