TS : దానం నాగేందర్ బిగ్ షాక్.. హైకోర్టు నోటీసులు

Update: 2024-03-22 09:37 GMT

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender)  బిగ్ షాక్ తగిలింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. జస్టిస్ విజయసేన్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. దీనిపై దానం నాగేందర్ కు నోటీసులు జారీ చేసింది.

దానం నాగేందర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారని విజయారెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఓటర్లకు డబ్బులు పంచారని, ఈ విషయంలో కేసులు నమోదయ్యాయని కోర్టుకు వివరించారు. ఆయన సతీమణి పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలను నామినేషన్‌ పత్రాల్లో పేర్కొనలేదన్నారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరుపున పోటీ చేసిన దానం నాగేందర్ .. బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డిపై గెలిచారు. 2024 మార్చి 17న బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దానం నాగేందర్ ను సికింద్రబాద్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది.

Tags:    

Similar News