TG : 17లోపు తేల్చండి... బీఆర్ఎస్ వరంగల్ సభ పిటిషన్ పై హైకోర్టులో విచారణ

Update: 2025-04-12 07:00 GMT

హనుమకొండ ఎల్కతుర్తిలో నిర్వహించే సభకు పోలీసులు అనుమతి ఇవ్వ కపోవడంపై బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఈనెల 21కి వాయిదా వేసింది. సభకు పర్మిషన్ ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలంటూ బీఆర్ఎస్ నేతలు పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నెల 27న ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా దీన్ని ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ తరఫు లాయర్ పే ర్కొన్నారు. దీంతో హోంశాఖ ముఖ్య కార్యదర్శి, వరంగల్ సీపీ, కాజీపేట ఏసీపీలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయడానికి హోంశాఖ తరఫు న్యాయవాది సమయం కోరారు. ఈ నెల 21 వరకు గడువు ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. సభకు ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది కదా అని హైకోర్టు ప్ర శ్నించింది. ఈనెల 17లోపు సభ అనుమతిపై నిర్ణయం వెల్లడించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది. 

Tags:    

Similar News