Bandi Sanjay : కరీంనగర్-పిట్లం మార్గాన్ని నేషనల్ హైవేగా ప్రకటించండి .. బండి సంజయ్
తెలంగాణలోని కొన్ని ముఖ్యమైన రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా ప్రకటించాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన గడ్కరీకి ఒక లేఖ రాశారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నియో జకవర్గం పరిధిలో ఈ మార్పులు అవసరమని లేఖలో పేర్కొన్నారు. కరీంనగర్ - సిరిసిల్ల - కా మారెడ్డి - ఎల్లారెడ్డి - పిట్లం రహదారి (మొత్తం165కి.మీ.ల పొడవు), అదే విధంగా సిరిసిల్ల వేములవాడ - కోరుట్ల రహదారి (మొత్తం 65కి.మీ.ల పొడవు) జాతీయ రహదారులుగా పార్టీ - హైదర్ సెంట్రల్ జిల్లా మార్చాలని కోరారు. వీటితో పాటు రాయ్ పూర్ నుంచి హైదరాబాద్ వరకు గ్రీన్ ఫీల్డ్ కారిడార్ పై డీపీఆర్ సిద్దం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఇది తెలంగాణ, చత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య అను సంధానాన్ని గొప్పగా మెరుగు పరుస్తుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి రాసిన లేఖలో పే ర్కొన్నారు. తెలంగాణలో 280కి.మీల ప్రతిపా దితరహదారులు ముఖ్యమైన ఆర్థిక, తీర్థయాత్ర లను కలుపుతాయని చెప్పారు. వీటిని జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయడం వలన మెరుగైన మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల ఆకర్షణ మరియు లక్షల మంది పౌరులకు లాభం కలుగుతుందని పేర్కొన్నారు.