గణేష్ నిమజ్జనాలు ముగియడంతో హైడ్రా అక్రమనిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోంది. నిన్న తెల్లవారు జామునుంచే కూల్చివేతలు మొదలు పెట్టినా..అర్థరాత్రి వరకు కూల్చివేతలు కొనసాగాయి. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలో అర్థరాత్రి దాటినా కూల్చివేతలు కొనసాగాయి. కిష్టారెడ్డిపేట్ 164 సర్వే నెంబర్‌లో ప్రభుత్వ స్థలంలో నిర్మించిన మూడు బిల్డింగులను కూల్చివేశారు అధికారులు. దీంతో ఎలాంటి ఘటనలు జరుగకుండా పోలీసులు భారీగా బందోబస్తు చేపట్టారు.