తెలంగాణ బీజేపీలో లొసుగులు మరోసారి బయటపడ్డాయి. ఇవాళ బీజేఎల్పీ సమావేశం హాట్ హాట్ గా జరిగింది. పార్టీలో తమకు తగిన గుర్తింపు, గౌరవం దక్కటం లేదని బీజేపీ ఎమ్మెల్యేలు కొద్ది రోజులుగా ఆవేదనగా చెప్పారు. ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యేలను పార్టీ ప్రధాన కార్యదర్శులు కంట్రోల్ చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో ఇవాళ జరిగిన బీజేఎల్పీ సమావేశం చర్చనీయాంశం అయింది. కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలపై తమ భవిష్యత్తు కార్యాచరణను బీజేఎల్పీ ప్రకటించింది. రుణమాఫీ లోపాలపై ప్రభుత్వాన్ని రైతుల్లో దోషిగా నిలబెడతామని బీజేపీ నేతలు మీడియా పాయింట్ లో మాట్లాడుతూ తెలిపారు.