Telangana : తెలంగాణలో ఇవాళ కొత్త రేషన్ కార్డుల పంపిణీ

Update: 2025-07-14 08:15 GMT

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. జూలై 14, 2025 (సోమవారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభిస్తారు. తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.4 లక్షల కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. దీని ద్వారా దాదాపు 11.30 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. కొత్తగా జారీ చేయనున్న కార్డులతో కలిపి తెలంగాణలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 94.72 లక్షలకు చేరుకుంటుంది. దీని ద్వారా మొత్తం 3.14 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందిస్తామని, ఇది నిరంతర ప్రక్రియ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారు తమ దరఖాస్తు స్థితిని ఆన్‌లైన్‌లో సులభంగా తెలుసుకోవచ్చు.

తెలంగాణ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: https://epds.telangana.gov.in/FoodSecurityAct/

హోమ్ పేజీలో కనిపించే "FSC Search" ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

అక్కడ "FSC Application Search" అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.

ఆ తర్వాత మీ జిల్లాను ఎంపిక చేసుకుని, మీ సేవా అప్లికేషన్ నంబర్‌ను ఎంటర్ చేసి "Search" బటన్‌పై క్లిక్ చేయండి.

మీ దరఖాస్తు స్థితి స్క్రీన్‌పై కనిపిస్తుంది (Approve అయిందా, లేదా పెండింగ్‌లో ఉందా అనేది తెలుస్తుంది).

Tags:    

Similar News