TG : సమీకృత మండల కార్యాలయాల భవన సముదాయాలకు ప్రారంభోత్సవాలు చేసిన జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క
నిజామాబాద్ జిల్లా మోస్రా, చందూర్ మండల కేంద్రాలలో నూతనంగా నిర్మించిన సమీకృత మండల కార్యాలయాల భవన సముదాయాలకు జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళ శిశు సంక్షేమం, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆదివారం ప్రారంభోత్సవాలు చేశారు. అదేవిధంగా మోస్రా లో జనరల్ ఫంక్షన్ హాల్, చందూర్ లో నూతన గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించారు. లబ్దిదారులకు రేషన్ కార్డుల మంజూరీ పత్రాలు, స్వయం సహాయక మహిళా సంఘాలకు వడ్డీ లేని బ్యాంకు లింకేజీ రుణాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్, రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.