TS : కరెంట్ పోవద్దు.. ట్రాఫిక్ సమస్య రావద్దు.. సీఎం రేవంత్ ఆదేశాలు

Update: 2024-05-08 07:02 GMT

వర్షం, వాతావరణం పరిస్థితులపై తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని జిహెచ్ఎంసి, ట్రాన్స్కో, పోలీసు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. భారీ వర్షం, ఈదురుగాలులతో రాజధాని హైదరాబాద్ నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం,ట్రాఫిక్ సమస్యలు, విద్యుత్ అంతరాయాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు.

వరంగల్ పట్టణంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి నుంచే జిహెచ్ఎంసీ కమిషన్ రోనాల్డోస్ సిటీ పోలీస్ కమిషనర్ కె. శ్రీనివాస్ రెడ్డి, ట్రాన్స్ సిఎండి ఎస్.ఏ.ఎస్. రిజి, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. భారీ వర్షాలు, ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే సమస్యను పరిష్కరించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించారు.

లోతట్టు ప్రాంతాల్లో జలమయమైన కాలనీల్లో ప్రజలకు అవసరమైన వేయూతను అందించాలని సూచించారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను సాధ్యమైనంత త్వరగా క్లియర్ చేసి వాహన దారులు త్వరగా ఇళ్లకు చేరుకునేలా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది చేపట్టే సహాయక చర్యల్లో భాగస్వాములు కావాలని, సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు.

Tags:    

Similar News