TS : తెలంగాణకు వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలెర్ట్‌

Update: 2024-04-25 05:54 GMT

తెలంగాణలో పలు ప్రాంతాల్లో గురువారం నుంచి వడగాలులు వీస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. శని, ఆదివారాల్లో కొన్ని జిల్లాల్లో వాటి తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక గురు, శుక్రవారాల్లో తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.

బుధవారం రాష్ట్రంలోని పలుచోట్ల 45 డిగ్రీలకు చేరువగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. నల్లగొండ జిల్లా బుగ్గబాయిగూడలో అత్యధికంగా 44.9 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. వాతావరణ శాఖ రాగల రెండు రోజుల పాటు మూడు నాలుగు జిల్లాలు మినహా అన్ని జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది.

మరోవైపు ఏపీలోనూ ఎండలు దంచికొడుతున్నాయి. గురువారం 54 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 154 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. రేపు 36 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 157 వడగాడ్పులు వీస్తాయని పేర్కొన్నారు. ఇవాళ అత్యధికంగా విజయనగరం(D) తుమ్మికపల్లిలో 45 డిగ్రీలు, వైఎస్సార్(D) బలపనూర్‌లో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.

Tags:    

Similar News