మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఘాటు వ్యాఖ్యలు

Etela Rajendar: మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల రాజేందర్‌.. ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Update: 2021-08-08 11:00 GMT

Etela Rajendar: మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల రాజేందర్‌.. ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉరుములు వచ్చినా, పిడుగులు పడినా తన గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌ లోని చెల్లూర్‌లో పెద్ద ఎత్తన.. ఈటల ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా హుజురాబాద్‌లో పోటీ చేయాడానికి, కేసీఆర్, హరీష్‌ వస్తారా అన్న ఈటల.. తాను దిక్కులేని వాడిని కాదని.. హుజురాబాద్‌ ప్రజల హృదయాల్లో చోట్లు సంపాదించుకున్నానని పేర్కొన్నారు. దమ్ముంటే నిజాయితీగా ఓట్లు వేయించుకోండని.. ప్రలోభాలు, దావతులు ఆపాలన్నారు. టీఆర్ఎస్‌కి హుజురాబాద్ దళితుల మీద ప్రేమ లేదు కానీ వారి ఓట్ల మీద మాత్రమే ప్రేమ ఉందన్నారు. టీఆర్ఎస్ నేతల మాటల్లో, చేతల్లో నిజాయితీ లేదని విమర్శించారు.

Similar News