Film Heroes Tweet on YouTuber : యూట్యూబర్ పిచ్చి వాగుడుపై సినీ హీరోల ట్వీట్లు..సీఎం రేవంత్, డీజీపీ స్పందన
టాలీవుడ్ యువ హీరో సాయిధరమ్ తేజ్ తల్లిదండ్రులను హెచ్చరిస్తూ ఓ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దారుణాలపై పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చిన్నపిల్లల ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేయొద్దని కోరారు. ఫన్నీ పేరుతో చిన్నపిల్లలను ట్రోల్ చేస్తున్న వీడియోను సాయిధరమ్ తేజ్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
కొంతమంది యూట్యూబర్స్ ఓ తండ్రి, తన కూతురి వీడియోను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడారు. దీనికి సంబంధించి కామెంట్స్ ను ఉద్దేశిస్తూ సాయిధరమ్ తేజ్ ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ, తెలంగాణ సీఎంలతో పాటు.. డిప్యూటీ సీఎంలు, డీజీపీలకు, పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అయితే సాయిధరమ్ తేజ్ ట్వీట్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, డీజీపీ స్పందించారు. పిల్లల జాగ్రత్తపై సూచనలు చేసిన సాయిధరమ్ తేజ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమస్యను తమ దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. తమ ప్రభుత్వం పిల్లల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు.
మరో హీరో మంచు మనోజ్ సహా.. చాలామంది సినీ ప్రముఖులు దీనిపై స్పందించి యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనలపై స్పందించిన ప్రణీత్ తన వీడియోలో అభ్యంతరకర పార్ట్ తొలగించానని చెప్పాడు.