ఓల్డ్ సిటీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దివాన్దేవిడిలోని మదీనా అబ్బాస్ టవర్స్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బిల్డింగ్నాలుగో ఫ్లోర్లోని 40కి పైగా బట్టల షాపులు మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. స్పాట్ కు చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది 10 ఫైరొంజిన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. హై దరాబాద్ జిల్లా ఫైర్ శాఖ అధికారి వెంకన్న మాట్లాడుతూ తెల్లవారు 2:15 గంటల సమయంలో అగ్నిప్రమాదం సమాచారం వచ్చిందని, షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదా మరో ఇతర విషయం ద్వారానా అని దర్యాప్తులో తేలుతుందని వివరించారు. ఇక మంటల ధాటికి భవనం స్లాబ్ ఏ క్షణంలో నైనా కూలిపోయే ప్రమాదం ఉందని అధికా రులు తెలిపారు. ఆ దుకాణాల్లో ఉన్న బట్టలు పూర్తిగా కాలిపోవడంతో భారీ ఆస్తి నష్టం జరిగింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది 10 ఫైరింజన్లతో మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.