హైదరాబాద్‌లో రాత్రి కురిసిన వర్షానికి పలు కాలనీలు నీట మునిగాయి. నాగోల్ బండ్లగూడలోని ఉన్న గ్రీన్ టెర్రస్ అపార్ట్మెంట్ సెలార్‌లోకి భారీగా నీరు చేరింది. దీంతో అపార్ట్మెంట్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కనీసం బయటకి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. వరద నీరు రాకుండా ఇసుక బస్థాలతో అడ్డుకట్ట వేసిన అగలేనంత వరద రావడంతో సెల్లార్‌లోకి మోకాళ్ళలోతు నీరు చేరింది. దీనితో అపార్ట్మెంట్ వాసుల వాహనాలు వరదలో మునిగాయి.