నైరుతి పవనాలు విస్తరిస్తున్న నేపథ్యంలో నేటి నుంచి తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో నేడు, రేపు ఓ మోస్తరు వర్షం కురుస్తుందని తెలిపింది. 10, 11 తేదీల్లో నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని సూచించింది.
నైరుతి రుతుపవనాల ప్రవేశంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రేపు ఏపీలోని రాయలసీమ, ఉభయగోదావరి, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, మన్యం, అల్లూరి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వానలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. తెలంగాణ లోని పలు జిల్లాల్లో మరో 5 రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.