Ibrahimpatnam: కలకలం రేపుతున్న కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు.. నలుగురు మహిళలు మృతి..
Ibrahimpatnam: రంగారెడ్డి జిల్లాలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మృతి చెందడం కలకలం రేపుతుంది.;
Ibrahimpatnam: రంగారెడ్డి జిల్లాలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మృతి చెందడం కలకలం రేపుతుంది.. నిన్న ఇద్దరు మహిళలు మృతి చెందగా.. ఇవాళ మరో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఈ దారుణం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నంలో చోటుచేసుకుంది. పరిస్థితి వషమంగా ఉండటంతో మహిళలను ఓవైసీ అసుపత్రికి తరలించి చికిత్స అందించే ప్రయత్నం చేశారు.. అయితే తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ మరో ఇద్దరు మహిళలు మరణించారు. ఓవైసీ హాస్పటల్ ముందు మృతుల బంధువులు ఆందోళన చేపట్టడంతో సాగర్ హైవే మీద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.దీంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.