తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఉచిత బస్సు మహాలక్ష్మి పథకానికి అక్టోబర్ 29తో 300 రోజులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు ఈ ఫ్రీ బస్సు సర్వీసును రాష్ట్ర వ్యాప్తంగా 90కోట్ల మంది మహిళలు వినియోగించుకున్నారని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.
కరీంనగర్ జిల్లా అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి సజ్జనార్ కూడా పాల్గొన్నారు. 2023 డిసెంబర్ 9న ప్రారంభమైన మహాలక్ష్మి పథకం.. ఈ రోజుతో 300 రోజులకి చేరింది.