TG : గద్వాల్ ఎమ్మెల్యే కాంగ్రెస్లోనే ఉన్నారు : మంత్రి జూపల్లి

Update: 2024-08-01 07:21 GMT

గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి పార్టీ మార్పులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. కృష్ణమోహన్ రెడ్డి ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గురువారం ఉదయం కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి జూపల్లి వెళ్లారు. పార్టీ మారొద్దని కాంగ్రెస్లోనే కొనసాగాలని ఆయన్ని కోరారు. అనంతరం జూపల్లి మాట్లాడారు. పాత పరిచయాలతోనే ఇటీవల బీఆర్ఎస్ నేతలను కలిశారని చెప్పారు. బండ్ల పార్టీ మార్పు వార్తలు అన్ని ఊహగానాలే అని కొట్టిపడేశారు. తమ మధ్య ఎలాంటి గ్యాప్ లేదని.. అందరం కలిసే ఉన్నామని చెప్పారు. ఆ తర్వాత కృష్ణ మోహన్ రెడ్డితో కలిసి జూపల్లి హైదరాబాద్ వెళ్లారు.

కేటీఆర్ను కలిసిన బండ్ల

గతంలో బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి.. రెండు రోజుల క్రితం తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు ప్రచారం జరిగింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కృష్ణ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. దీంతో కాంగ్రెస్ అలర్ట్ అయ్యింది. మంత్రి జూపల్లిని రంగంలోకి దించింది. బండ్ల కాంగ్రెస్ లోనే కొనసాగేలా చూసే బాధ్యతలను జూపల్లికి అప్పగించింది.

Tags:    

Similar News