మళ్లీ కూల్చివేతలకు హైడ్రా రెడీ అవుతోది. నగరంలని పలు చెరువుల్లో ఆక్రమణలపై నిర్ధారణకు వచ్చినా హైడ్రా, గణేశ్ నవరాత్రుల నేపథ్యంలో కాస్త స్పీడు తగ్గించినట్లు తెలుస్తోంది. గణేశ్ విగ్రహాల వద్ద పోలీసు సెక్యూరిటీ అవసరమున నేపథ్యంలో కూల్చివేతలకు కావలసిన పోలసు సిబ్బంది అందుబాటులో ఉంటారా? లేదా? అన్నది తెలుసుకుంటున్నట్టు సమాచారం.
ఒక వేళ సిబ్బంది అందుబాటులో ఉంటే వారాంతంలో కూల్చివేతలు ఉండే అవకాశం ఉంది. లేకపోతే నిమజ్జనం తరువాత ఆక్రమణల తొలగింపు వుందని తెలుస్తోంది. కాగా రెండున్నర నెలల వ్యవధిలో చెరువులు, పార్కుల్లో 262 నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేసింది. 111.72 ఎకరాల స్థలం స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు హైడ్రా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.