Kavitha : ఎమ్మెల్సీ కవిత రాజీనామాపై గుత్తా కీలక వ్యాఖ్యలు.. ఆలోచించుకోవాలని సలహా...

Update: 2025-09-18 09:31 GMT

బీఆర్ఎస్ పార్టీలోనే కాదు...తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. పార్టీ నుండి సస్పెండ్ చెయ్యడంతో... తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు కవిత. కాగా ఈ రాజీనామా పై తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన గుత్తా...కవిత రాజీనామాపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. ఇటీవల కవిత ఫోన్ చేసి తన రాజీనామాను ఆమోదించాలని కోరారని, అయితే ఆమె పార్టీ నుంచి బహిష్కరణకు గురైనందున భావోద్వేగంతో రాజీనామా చేసి ఉండవచ్చని, అందుకే పునరాలోచన చేసుకోవాలని తాను సూచించినట్లు తెలిపారు. కాగా ఈ నెల 3న కవిత పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే . దాదాపు 15 రోజులు గడిచినా, ఆమె రాజీనామాపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం ఉత్కంఠకు దారితీసింది. ఈ నేపథ్యంలో గుత్తా వ్యాఖ్యలు ప్రాధాన్యత ను సంతరించుకున్నాయి.

Tags:    

Similar News