ఫోర్త్​ సిటీ పేరుతో సర్కారు భూములను కాజేసే కుట్ర .. హరీశ్​ రావు ఆరోపణలు

Update: 2024-08-30 06:45 GMT

ఫోర్త్‌ సిటీ పేరుతో ప్రభుత్వ భూములు కొల్లగొట్టే కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు సంచలన ఆరోపణలు చేశారు.గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కందుకూరులో 385 ఎకరాలు సర్వే నంబర్ 9లో ప్రభుత్వ భూమిని కొల్లగొట్టడానికి సర్వే చేస్తున్నారని.. తుక్కుగూడలో 25 ఎకరాలు సర్వే నంబర్ 895లో పేద రైతుల దగ్గర బినామీల పేరుతో తీసుకుంటున్నారని ఆరోపించారు. ‘రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో ప్రభుత్వంలో పెద్దలుగా చలామణీ అవుతున్న తమ్ముళ్ల పీఏల పేరుమీద భూములు కొంటున్నారన్నారు. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు బయటపెడుతానన్నారు. సీఎం రేవంత్ సొంత సెగ్మెంట్ కొడంగల్ లో లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ తగ్గిందన్నారు. రేవంత్ దగ్గరుండి మహబూబ్ నగర్ లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణను ఎంపీ గెలించారని హరీశ్​ రావు మండిపడ్డారు. ప్రధాని మోదీతో రేవంత్ మాట్లాడుకొని వచ్చి తెలంగాణలో బీజేపీ ఎంపీలను గెలిపించారన్నారు. రుణమాఫీపై బీఆర్ఎస్ రిపోర్ట్ ఇస్తే రేవంత్ రెడ్డి సీఎం పదవిలో ఉండి ఎందుకని హరీశ్​ రావు ప్రశ్నించారు. కవితకు బెయిల్ రావడంపై సుప్రీం తీర్పును సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి తప్పుపట్టడం నేరమని హరీశ్ రావు అన్నారు.ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి బెయిల్ బీజేపీ ఇస్తేనే వచ్చిందా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందన్నారు. కవిత బెయిల్ విషయంలో న్యాయం, ధర్మం గెలిచిందన్నారు. 

Tags:    

Similar News