TG High Court : హరీశ్ రావుకు హైకోర్టులో ఊరట

Update: 2025-03-20 10:15 GMT

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఆయనపై నమోదు చేసిన ఎఫ్ఎ ఆర్ ను న్యాయస్థానం కొట్టివేసింది. కాంగ్రెస్ నాయకుడు, సిద్దిపేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధరగౌడ్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు హరీశ్రవుతో పాటు టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుపై కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ వారిద్దరినీ నిందితులుగా చేర్చారు. దీంతో వారిపై నమోదైన కేసును కొట్టివేయాలని హరీశ్ రావు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే దర్యాప్తులో భాగంగా హరీశ్ రావు అరెస్ట్ చేయవద్దంటూ గతంలో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసులో ఇవాళ ఇరువైపుల వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం.. వాళ్లపై దాఖలైన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎఫ్ఆర్ ను కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Tags:    

Similar News