తెలంగాణలో భారీవర్షాలతో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. కామారెడ్డి జిల్లా గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జలమయం అయింది. బిక్కనూరు మండలం రామేశ్వర్‌పల్లి గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి.
బొబ్బిలి చెరువు నిండటంతో చెరువు నీరు డబుల్ బెడ్ రూమ్‌ల ఇళ్లలోకి చేరింది. విషయం తెలుసుకున్న బిక్కనూర్ ఎస్సై సాయికుమార్ పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బందితో కలిసి సహాయచర్యలు చేపట్టారు. ఇళ్లలో ఉన్న 27 కుటుంబాలను గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు తరలించారు.