నల్గొండలో బీఆర్ఎస్ రైతు మహా ధర్నాకు తెలంగాణ హైకోర్టు ఓకే చెప్పింది. తమ మహా ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ నెల 28న నల్గొండ క్లాక్ టవర్ సెంటర్‌లో రైతు మహాధర్నా నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. అయితే పోలీసులు అనుమతులు ఇవ్వలేదు. దీంతో బీఆర్ఎస్ నేతలు మహాధర్నాకు అనుమతులు ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం జనవరి 28న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మహాధర్నా కార్యక్రమానికి అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.