ప్రణయ్ పరువు హత్య కేసులో కోర్టు ఇచ్చిన తీర్పుపై మృతుడి తండ్రి బాలస్వామి స్పందించారు. ప్రణయ్ హత్య తర్వాత తాము చాలా కోల్పోయామన్నారు. 'జస్టిస్ ఫర్ ప్రణయ్' అంటూ పోరాటం చేశామని, అయినప్పటికీ చాలా పరువు హత్యలు జరిగాయని, అలాంటి హత్యలు చేసిన వారం దరికీ సోమవారం కోర్టు ఇచ్చిన తీర్పుతో కనువిప్పు కల గాలన్నారు. ఈ కేసు లో శిక్ష పడిన వారి కుటుంబాలు కూడా బాధపడుతుంటాయని, కోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో పరువు హత్యలు ఆగిపోవాలని కోరుకున్నారు. కోర్టు తీర్పుతో న్యాయమే గెలిచిందన్నారు. ఒకరిని చంపడం అనేది కరెక్ట్ కాదు.తమకు ఎవరి మీద కోపం లేదన్నారు. అంతకుముందు కొడుకు సమాధి వద్దకు వెళ్లిన ప్రణయ్ కుటుంబ సభ్యులునివాళులర్పించారు. కుమారుడి సమాధిపై పూలు చల్లి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.