హీటెక్కిన హుజూరాబాద్ రాజకీయం.. టీఆర్ఎస్, బీజేపీ మాటల యుద్ధం..
Huzurabad: హుజురాబాద్ వార్ పీక్ స్టేజ్‌కు చేరింది. ఉపఎన్నికల నేపథ్యంలో సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకుంటున్నారు నేతలు.;
Huzurabad: హుజురాబాద్ వార్ పీక్ స్టేజ్‌కు చేరింది. ఉపఎన్నికల నేపథ్యంలో సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకుంటున్నారు నేతలు. మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల రాజేందర్.. ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉరుములు వచ్చినా, పిడుగులు పడినా తన గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లోని చెల్లూర్‌లో పెద్ద ఎత్తన.. ఈటల ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా హుజురాబాద్‌లో పోటీ చేయాడానికి, కేసీఆర్, హరీష్ వస్తారా అన్న ఈటల.. తాను దిక్కులేని వాడిని కాదని.. హుజురాబాద్ ప్రజల హృదయాల్లో చోట్లు సంపాదించుకున్నానని పేర్కొన్నారు.
దమ్ముంటే నిజాయితీగా ఓట్లు వేయించుకోండని.. ప్రలోభాలు, దావతులు ఆపాలన్నారు. టీఆర్ఎస్‌కి హుజురాబాద్ దళితుల మీద ప్రేమ లేదు కానీ వారి ఓట్ల మీద మాత్రమే ప్రేమ ఉందన్నారు. టీఆర్ఎస్ నేతల మాటల్లో, చేతల్లో నిజాయితీ లేదని విమర్శించారు. అటు...ఈటలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్. బీజేపీ అసత్య ప్రచారంతో ఎన్నికల్లో గెలవాలని చూస్తోందన్నారు. హుజురాబాద్‌లో బీజేపీ నేతలు గోబెల్స్ కన్నా తీవ్ర స్థాయిలో అబద్ధపు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. దళిత బంధు హుజురాబాద్‌లో వద్దని ఈటల అంటున్నారని.. అసలు దళిత బంధు, రైతు బంధు, కళ్యాణ లక్ష్మిపై బీజేపీ వైఖరేంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.