TG : ఫార్మా క్యాపిటల్ గా హైదరాబాద్.. కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
హైదరాబాద్ జీనోమ్ వ్యాలీకి మరిన్ని పె ట్టుబడులు వచ్చే విధంగా ఫార్మా కంపెనీలకు భారీ ప్రోత్సాహకాలు, సకల వసతులు కల్పిస్తున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. జీనోమ్ వ్యాలీలో పెట్టుబడుల విస్తరణపై వివిధ కంపెనీల ప్రతినిధులతో సమా వేశమై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్ ఇమేజ్ అభివృద్ధికి గడిచిన నాలుగు దశాబ్ధాల కాలంగా వైద్య రంగంలో కృషి చేస్తూ సేవ లందిస్తున్న ఫార్మా పరిశ్రమలకు మరింతగా ప్రోత్సహిస్తామన్నారు.
హైదరాబాద్ బ్రాండ్ ను ప్రపంచంలోనే ఫార్మా కంపెనీల క్యాపిటల్ గా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో హైదరాబాద్లో ప్రముఖ ఫార్మా పరిశ్రమలైన లారస్ ల్యాబ్స్, కర్క ల్యాబ్స్ జాయింట్ వెంచర్ గా సుమారు 300 ఎకరాల్లో రూ.2 వేల కోట్లతో పరిశ్ర మలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. వీటి ద్వారా వందలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతిపక్షాల విమర్శలు సరికాదన్నారు.