హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి ఎలిమినేట్
తొలి ప్రాధాన్యత ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్ధి వాణిదేవి మొదటి స్థానంలో ఉన్నారు.;
తెలంగాణలో శాసనమండలి పట్టభద్రుల ఓట్ల లెక్కింపు కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి ఎలిమినేట్ అయ్యారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో ఇప్పటి వరకు 90 మంది ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తైంది. రెండో ప్రాధాన్యత ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్ధి వాణిదేవి ఆధిక్యం 10వేల 35 ఓట్ల నుంచి 9వేల 119కి తగ్గింది. మొదటి, రెండో ప్రాధాన్యత ఓట్లతో కలిపి వాణిదేవికి లక్షా 19వేల 619 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావుకు లక్షా 10వేల 500 ఓట్లు, ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు 59వేల 649 ఓట్లు వచ్చాయి.
హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీకి మొత్తం 93 మంది పోటీ చేశారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్ధి వాణిదేవి మొదటి స్థానంలో ఉండగా, బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావు రెండో స్థానంలో, మూడో స్థానంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ కొనసాగుతున్నారు.