సీఎం రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) మానస పుత్రిక హైడ్రా మళ్లీ యాక్టివ్ అయింది. గణపతి ఉత్సవాలు ముగియడంతో మరోసారి కూల్చివేతలు ప్రారంభించింది. రంగారెడ్డి జిల్లా కోకాపేట్‌లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. సర్వే నెంబర్ 147లో వెలసిన అక్రమ నిర్మాణాలకు తొలగిస్తున్నారు అధికారులు. జేసీబీల సహాయంతో నిర్మాణాలు కూల్చుతున్నారు. పోలీసులు భారీ బందోబస్తు నడుమ ఈ కూల్చివేతలు నడుస్తున్నాయి.
హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో నిర్ణయించింది. కేసులు, కోర్టు చిక్కులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.