TG : ఆమ్రపాలి సహా ఐఏఎస్ ఆఫీసర్ల బాధ్యతల్లో మార్పులు

Update: 2024-06-25 05:02 GMT

తెలంగాణలో భారీగా సివిల్ సర్వీసు ఉద్యోగులను బదిలీ చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారం, పది రోజుల క్రితమే 22 మంది ఐఏఎస్ లను, 28 మంది ఐపీఎస్ లను బదిలీ చేసిన సర్కారు తాజాగా 44 మందిని స్థానచలనం చేసింది. సుస్థిర పాలన వైపు అడుగులు వేసే దిశగా అన్నిశాఖల్లో కీలక మార్పులు, చేర్పులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

పరిపాలనా విధానాలు, ప్రక్షాళన, ఆర్థిక సుస్థితర లక్ష్యాల నేపథ్యంలో కొంతమంది అధికారులకు కీలక పదవుల్లో నియమిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే 44 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు బదిలీ చేస్తూ సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. తుది విడతగా మరికొంత మంది కేంద్ర సర్వీసు అధికారులను కూడా బదిలీ చేసేందుకు ముఖ్యమంత్రి కార్యాలయ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన బదిలీల్లో జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు అప్పగించగా... ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ సుల్తానియాను నియమించారు.

మల్టీ జోన్-1 ఐజీగా ఉన్న ఏవీ రంగనాథ్ కు ప్రభుత్వం కీలక బాధ్యతలను అప్పగించింది. ఇప్పటి దాకా హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధికి పరిమితమైన విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ పోస్టును అప్ గ్రేడ్ చేసి హెచ్ఎండీఏ పరిధికి విస్తరిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News